పెళ్లికి లాక్‌డౌన్ అడ్డంకి కాకూడ‌ద‌ని వ‌ధువు ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2020-05-23T14:53:57+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్ వారి వివాహానికి ఆడ్డంకిగా మారింది. మే 4 న నిర్ణయించిన వారి వివాహం లాక్‌డౌన్‌ కార‌ణంగా మే 17కు వాయిదా ప‌డింది. ఇంత‌లో లాక్‌డౌన్ మ‌రో మారు పొడిగించారు.

పెళ్లికి లాక్‌డౌన్ అడ్డంకి కాకూడ‌ద‌ని వ‌ధువు ఏం చేసిందంటే...

కాన్పూర్: కరోనా మహమ్మారి కారణంగా అమలు చేసిన లాక్‌డౌన్ వారి వివాహానికి ఆడ్డంకిగా మారింది. మే 4 న నిర్ణయించిన వారి వివాహం లాక్‌డౌన్‌ కార‌ణంగా మే 17కు వాయిదా ప‌డింది. ఇంత‌లో లాక్‌డౌన్ మ‌రో మారు పొడిగించారు. దీంతో మరోమారు వారి వివాహం వాయిదా ప‌డే అవ‌కాశాలు క‌నిపించాయి. అయితే త‌మ వివాహం మ‌రోమారు వాయిదా ప‌డ‌కూడ‌ద‌ని వ‌ధువు విచిత్ర నిర్ణ‌యం తీసుకుంది. యూపీలోని కాన్పూర్ ప‌రిధిలోగ‌ల‌ మంగల్పూర్‌గ్రామ‌ నివాసి గోల్డీ(19) 12 గంటలపాటు కాలినడకన వరుడు వీరేంద్ర కుమార్ రాథోడ్ ఉంటున్న‌ బైస్పూర్ గ్రామానికి చేరుకుంది. వ‌ధువు ఇలా రావ‌డాన్ని చూసిన వ‌రుని కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. వారు తేరుకుని వ‌ధువు కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. రెండు కుటుంబాల సమ్మతితో వరుడి గ్రామంలోని ఒక ఆలయంలో గోల్డీ, వీరేంద్రలకు‌ వివాహం చేశారు. ఈ సంద‌ర్భంగా గోల్డీ మాట్లాడుతూ తాను 12 గంటల్లో 80 కిలోమీటర్లు న‌డిచి వరుడి గ్రామానికి చేరుకున్నాన‌ని, ఈ  ప్రయాణంలో తాను ఏమీ తినలేదని చెప్పింది. చిన్న బ‌ట్ట‌ల బ్యాగ్ తీసుకుని బ‌య‌లు దేరాన‌ని తెలి‌పింది. పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహం జ‌రగ‌డం ఆనందంగా ఉంద‌ని గోల్డీ తెలిపింది. 

Updated Date - 2020-05-23T14:53:57+05:30 IST