Kanpur వ్యాపారి హత్య కేసులో సీబీఐ చార్జ్ షీట్...ఆరుగురు పోలీసులపై కేసు

ABN , First Publish Date - 2022-01-08T13:26:50+05:30 IST

గోరఖ్‌పూర్‌లోని ఒక హోటల్‌లో కాన్పూర్ వ్యాపారి మనీష్ గుప్తా మృతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉత్తర ప్రదేశ్ పోలీసులపై చార్జిషీట్ దాఖలు చేసింది...

Kanpur వ్యాపారి హత్య కేసులో సీబీఐ చార్జ్ షీట్...ఆరుగురు పోలీసులపై కేసు

న్యూఢిల్లీ: గోరఖ్‌పూర్‌లోని ఒక హోటల్‌లో కాన్పూర్ వ్యాపారి మనీష్ గుప్తా మృతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఉత్తర ప్రదేశ్ పోలీసులపై చార్జిషీట్ దాఖలు చేసింది.సెప్టెంబరు 27న గోరఖ్‌పూర్‌లో వ్యాపారవేత్త మనీష్ గుప్తా హోటల్ గదిలోకి ప్రవేశించిన పోలీసులు అతన్ని హతమార్చారు.సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో ఆరుగురు యూపీ పోలీసులపై హత్యానేరం మోపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సీబీఐ పోలీసులపై చార్జ్‌షీట్ వేయడం సంచలనం రేపింది. లక్నోలోని ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు దాఖలు చేసిన చార్జిషీట్‌లో సీబీఐ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 302, 201, ఐసీసీ సెక్షన్లు 120-బి 34 లను నమోదు చేసింది. 


కాన్పూర్ నగర ఇన్‌స్పెక్టర్ జగత్ నారాయణ్ సింగ్, ముగ్గురు సబ్-ఇన్‌స్పెక్టర్లు అక్షయ్ మిశ్రా, విజయ్ యాదవ్, రాహుల్ దూబే, హెడ్ కానిస్టేబుల్ కమలేష్ యాదవ్, ఒక కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్ సహా ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థన మేర కేంద్రం ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగి నవంబర్ 2వతేదీన పోలీసులపై కేసు నమోదు చేసింది.


Updated Date - 2022-01-08T13:26:50+05:30 IST