Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 17 May 2022 18:05:49 IST

Chethanaraj : ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ప్రాణాలొదిలిన కన్నడ నటి

twitter-iconwatsapp-iconfb-icon

సౌందర్యానికి అధిక ప్రధాన్యతనిచ్చే పలువురు నటీమణులు.. అందులో భాగంగా పలు శస్త్రచికిత్సలు చేయించుకోవడం సర్వసాధారణం. అయితే ఆ సమయంలో కొందరు అనూహ్య పరిస్థితుల్లో మరణించిన సందర్భాలున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ (Arthi agarwal) సన్నబడే క్రమంలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఓ సంఘటనే కన్నడ టీవీ రంగాన్ని కుదిపేస్తోంది. పలు కన్నడ టీవీ సిరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందిన చేతనారాజ్ (Chethanaraj) .. తన సౌందర్యానికి మెరుగులు దిద్దుకొనే క్రమంలో ప్లాస్టి్క్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆ క్రమంలో ఆమె ట్రీట్ మెంట్ తీసుకుంటూ ప్రాణాలొదలడం దురదృష్టమని చెప్పాలి.  సోమవారం (మే 16) ఫ్యాట్ ఫ్రీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న చేతనారాజ్ (Chethanaraj) కొద్ది రోజుల్లోనే అస్వస్థతకు గురైంది. ఊపిరితిత్తుల్లో ద్రవాలు అధికంగా చేరడంతో చేతనారాజ్ (Chethanaraj) తుది శ్వాస విడిచింది. 


ఆమెను ఎంత కాపాడాలనుకున్నప్పటికీ వైద్యులకు అది సాధ్యం కాలేదు. నటి తల్లిదండ్రులు.. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ ప్రాణాల్ని కోల్పోయిందంటూ ఆరోపిస్తున్నారు. ఇది వరకు చేతనారాజ్ (Chethanaraj) పలు సబ్బుల యాడ్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకున్నారు. బెంగళూర్ రాజాజీనగర్ లోని శెట్టి కాస్మెటిక్ సెంటర్ లో ఫ్రీ ఫ్యాట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొనే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. చేతనారాజ్ (Chethanaraj) మృతిపట్ల పలువురు కన్నడ టీవీ, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం తెలియచేశారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement