Jul 1 2021 @ 18:45PM

స్వల్ప గాయాలతో బయటపడ్డ గురురాజ్‌!

కన్నడ నటుడు, దర్శకనిర్మాత జగ్గేశ్‌ తనయుడు గురురాజ్‌ కారు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ హైవేలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, స్వల్ప గాయాలతో గురురాజ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని జగ్గేశ్‌ తెలిపారు. కారు టైర్లు బ్లాస్ట్‌ కావడంతో అదుపు తప్పి ప్రమాదం జరిగిందనీ, గురురాజ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. గురురాజ్‌ కన్నడలో ‘7/జి బృందావన్‌ కాలనీ’ రీమేక్‌తో పాటు పలు చిత్రాలో హీరోగా నటించారు.