Oct 19 2021 @ 12:36PM

హాస్యనటుడు shankarrao కన్నుమూత

బెంగళూరు(karnataka): శాండల్‌వుడ్‌ ప్రముఖ హాస్యనటుడు శంకర్‌రావు (84) సోమవారం ఉదయం తుదిశ్వాస వీడినట్లు కుటుంబ స భ్యులు ప్రకటించారు. ప్రముఖ సీరియల్‌ ‘పాపా పాండు’ ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రంగస్థల నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయ న 150కు పైగా పేరొందిన సినిమాలలో నటించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఏళ్ల తరబడి రాణించిన పాపా పాండు, మాయా మృగ సీరియళ్లలోనూ నటించారు. పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. శంకర్‌రావు మృతిపట్ల దర్శకులు విజయప్రసాద్‌, టీఎన్‌ సీతారాంతో పాటు నటులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మధ్యాహ్నం బనశంకరిలో అంత్యక్రియలు నిర్వహించారు.