మరింత అందంగా అవ్వాలని Fat Removal Surgery చేయించుకున్న ఈ సినీ నటి పరిస్థితి చివరకు ఏమైందంటే..
ABN , First Publish Date - 2022-05-17T22:44:52+05:30 IST
ఆమె కన్నడ బుల్లితెర ప్రముఖ నటి.. పలు సీరియళ్లలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.. మరిన్ని అవకాశాలు పొందేందుకు
ఆమె కన్నడ బుల్లితెర ప్రముఖ నటి.. పలు సీరియళ్లలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.. మరిన్ని అవకాశాలు పొందేందుకు ఇంకా అందంగా తయారవ్వాలని నిర్ణయించుకుంది.. తన శరీరంలోని కొవ్వు శాతం తగ్గించుకోవాలని ఫ్యాట్ రిమూవల్ సర్జరీకి సిద్ధమైంది.. అయితే సర్జరీ జరుగుతున్న సమయంలో ఊపరితిత్తుల్లో సమస్య తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయింది.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని చేతన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కన్నడ బుల్లితెరపై ప్రసారమవుతున్న `గీత`, `దొరసాని`, `లీనింగ్ స్టేషన్` వంటి పలు సీరియళ్ల ద్వారా చేతన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులో నివసిస్తోంది. తెరపై మరింత అందంగా కనిపించాలంటే శరీరంలోని కొవ్వు శాతం తగ్గించుకోవాలని చేతన్ భావించింది. బెంగళూరులోని శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌కు వెళ్లి ఫ్యాట్ రిమూవల్ సర్జరీ చేయించుకుంది. సర్జరీ సమయంలో ఊపరితిత్తుల్లోకి నీరు చేరడంతో చేతన్ చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని, ఎలాంటి సౌకర్యాలు లేకుండా తమ కూతురికి ఆపరేషన్ చేశారని చేతన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేతన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.