Jun 14 2021 @ 01:59AM

ఐసీయూలో కన్నడ నటుడు సంచారి విజయ్‌

రోడ్డు ప్రమాదంలో కన్నడ నటుడు సంచారి విజయ్‌కు తీవ్ర గాయాలైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంటి నుంచి సొంతింటికి బైక్‌ మీద వెళుతుండగా... ఆయనకు యాక్సిడెంట్‌ జరిగింది. వెంటనే ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. సంచారి విజయ్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేస్తున్నామని వైద్యులు తెలిపారు.  ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ‘రంగప్ప హోగ్‌బిట్న’ (2011) సినిమాతో సంచారి విజయ్‌ హీరోగా పరిచయమయ్యారు. ‘నాను అవనాల్ల... అవలు’ చిత్రంలో ట్రాన్స్‌జెండర్‌గా నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డును అందుకున్నారు.