కన్న తండ్రి కిరాతకం..!

ABN , First Publish Date - 2021-10-23T05:52:15+05:30 IST

అనుమానపు పిశాచి అయిన తండ్రి.. కన్న బిడ్డనే కిరాతకంగా చంపేశాడు. రెండు నెలల పసిపాపను దారుణంగా హత్య చేశాడు.

కన్న తండ్రి కిరాతకం..!
చిన్నారితో తండ్రి మల్లికార్జున (ఫైల్‌)

రెండు నెలల కుమార్తె దారుణ హత్య.. భార్యపై అనుమానంతోనే..

కళ్యాణదుర్గం, అక్టోబరు22: అనుమానపు పిశాచి అయిన తండ్రి.. కన్న బిడ్డనే కిరాతకంగా చంపేశాడు.  రెండు నెలల పసిపాపను దారుణంగా హత్య చేశాడు. అరవకుండా నోటికి ప్లాస్టర్‌ వేసి, గోనెసంచిలో కట్టేసి, చెరువులో పడేసి ప్రాణం తీశాడు. ఈ ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన గొల్ల మల్లికార్జునకు బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన చిట్టెమ్మతో గతేడాది అక్టోబరులో వివాహమైంది. వీరికి రెండు నెలల క్రితం కుమార్తె జన్మించిం ది. చిట్టెమ్మ ఐదు నెలల గర్భిణిగా ఉండగా కాన్పు ని మిత్తం పుట్టింటికెళ్లింది. అప్పటి నుంచి భర్త కూడా అత్తవారి ఇంటి వద్దే ఉన్నాడు. పెళ్లైన కొద్దిరోజుల తర్వాత నుంచి భార్యను మల్లికార్జున అనుమానించేవాడు. బంధువులు, తల్లిదండ్రుల నుంచి ఫోన వచ్చినా.. ఎవరు చేశారు, ఎందుకు చేశారంటూ మందలించేవాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం మ రింత పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో చిన్నారికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం ద్విచక్రవాహనంలో మల్లికార్జున, చిట్టెమ్మ కళ్యాణదుర్గం వచ్చా రు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స చేయించారు. అనంతరం చిన్నారిని తన చిన్నమ్మకు చూపించి వస్తానని భార్యను నమ్మబలికించాడు మల్లికార్జున. ప్రణాళిక ప్రకారం చిన్నారి నోటికి ప్లాస్టర్‌ వేసి, ఓ గోనె సంచిలో మూటకట్టి పట్టణ సమీపంలోని ఓ చెరువులో పడేశాడు. రాత్రి పొద్దుపోయినా భర్త నర్సింగ్‌హోమ్‌ వద్దకు రాకపోవడంతో ఆందోళన చెందిన భా ర్య.. పట్టణ పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేసింది. సీఐ తేజోమూర్తి.. సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వరకు చిన్నా రి ఆచూకీ కోసం గాలించారు. శుక్రవారం బంధువుల సహకారంతో స్వగ్రామమైన ఐదుకల్లు, నరసాపురం తదితర ప్రాంతాల్లో గాలించారు. చివరకు పట్టణ సమీపంలోని చెరువులో చిన్నారి మృతదేహం తేలాడడాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి, చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పసిపాపను కన్నతండ్రే అతి కిరాతకంగా హత్యచేశాడనే విషయం తెలిసి చిన్నారి మృతదేహాన్ని చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. అల్లారుముద్దుగా ఉన్న చిన్నారిని విగతజీవిగా చూసిన తల్లి, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


బెంగళూరుకు పరారీ

భార్య చిట్టెమ్మపై అనుమానంతోనే భర్త మల్లికార్జున.. చిన్నారిని పథకం ప్రకారం హత్యచేసి, బెంగళూరుకు వెళ్లిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. మల్లికార్జున ఆచూకీ కోసం పోలీసులు సెల్‌కు ఫోన చేసి, వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. మల్లికార్జున.. తన స్నేహితులకు విషయం తెలిపినట్లు సమాచారం. చిన్నారిని హత్య చేసి కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని చెరువులో పడవేసి, తాను బెంగళూరు చేరుకున్నానని చెప్పాడని తెలుస్తోంది. మల్లికార్జున సెల్‌ సిగ్నల్‌ కూడా బెంగళూరు నగరంలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తలో వెల్లడైంది. విషయం తెలుసుకున్న ఇనచార్జ్‌ డీఎస్పీ ఆంతోనప్ప, సీఐ తేజోమూర్తి ఘటనాస్థలాన్ని పరిశీలించి, వివరాలను సేకరిస్తున్నారు.



Updated Date - 2021-10-23T05:52:15+05:30 IST