Kanishka Soni Sologamy: మగాళ్లపై నమ్మకం పోయింది.. స్వీయ వివాహం వెనుక అసలు నిజాలను బయటపెట్టిన Kanishka Soni

ABN , First Publish Date - 2022-08-24T20:52:18+05:30 IST

గత 15 ఏళ్లుగా బుల్లితెర మీద సత్తా చాటుతున్న కనిష్క సోనీ (Kanishka Soni Sologamy) ఇటీవలే పెళ్లి చేసుకుంది.

Kanishka Soni Sologamy: మగాళ్లపై నమ్మకం పోయింది.. స్వీయ వివాహం వెనుక అసలు నిజాలను బయటపెట్టిన Kanishka Soni

గత 15 ఏళ్లుగా బుల్లితెర మీద సత్తా చాటుతున్న కనిష్క సోనీ (Kanishka Soni Sologamy) ఇటీవలే పెళ్లి చేసుకుంది. మోడల్‌గా, నటిగా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న కనిష్క వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కనిష్క తనను తానే వివాహం చేసుకుంది. కనిష్క తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని కొందరు అభినందిస్తున్నారు. మరికొందరు విమర్శిస్తున్నారు. తనను తానే పెళ్లి చేసుకోవాలనే  నిర్ణయం వెనుక ఉన్న బాధాకర కథను కనిష్క పంచుకుంది. కనిష్క తన కెరీర్ ప్రారంభంలో ప్రేమలో పడి కష్టాలు ఎదుర్కొంది. అంతే కాకుండా చాలాసార్లు కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో ఆమె పురుషులపై నమ్మకాన్ని కోల్పోయింది. 


ఇది కూడా చదవండి..

Viral News: లావుగా ఉన్నాడని బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఏకంగా 70 కిలోలు తగ్గి షాకిచ్చిన ప్రియుడు!


`నేను చాలా ఏళ్లు ముంబైలో నివసించాను. ఆ తర్వాత దుబాయ్‌లో కూడా ఉన్నాను. నా చుట్టూ ఉన్న నటులు, దర్శకులు, నిర్మాతలను చూసి నాకు పెళ్లిపై నమ్మకం పోయింది. చాలా మంది అబ్బాయిలు వారి కుటుంబంతో ఒకలా, అమ్మాయిల ముందు మరొకలా ఉండటం నేను చూశాను. నా చుట్టూ ఉన్న, నేను చూసిన అబ్బాయిలు అసభ్యంగా, హింసాత్మకంగా ఉండేవారు. కెరీర్ ప్రారంభంలో ఒకరిని ఇష్టపడ్డాను. కానీ, హింసాత్మకంగా ఉండే, ధూమపానం చేసే వ్యక్తితో నేను ఎలా జీవించగలను. నా జీవితం ఏ అబ్బాయితోనూ ముడి పడి లేదని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తోంది. నేను ఒంటరిగా నడుస్తాను. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నాను. 


నేను చాలా నమ్మదగిన వ్యక్తిని. ఇతరుల నుంచి కూడా అదే ఆశిస్తాను. కానీ నేటి ప్రపంచంలో ఏ అబ్బాయీ నమ్మదగినవాడు కాదు. నేను ముంబైకి వచ్చినప్పుడు, చాలా మంది అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేసేవారు. నేను 1200 నుంచి 1300 మంది అబ్బాయిలను తిరస్కరించాను. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ నటుడు నాకు నేరుగా పెళ్లి ప్రపోజ్ చేశాడు. రెండు నెలల తర్వాత అతడి అసలు రూపం బయటపడింది. ఆ తర్వాత అతడికి దూరమై నా సహనటుడితో ప్రేమలో పడ్డాను. కానీ అతను ఒకే సమయంలో ముగ్గురు అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. విషయం తెలుసుకుని నా గుండె మళ్లీ పగిలిపోయింది. ఇక, నాకు ఎదురైన కాస్టింగ్ అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే నేను అబ్బాయిలపై నమ్మకం కోల్పోయాను. నాకు నేను చాలు`అని కనిష్క తెలిపింది. 

`

Updated Date - 2022-08-24T20:52:18+05:30 IST