కాణిపాకం హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2022-06-21T12:10:35+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.91.78,779 వచ్చింది. సోమవారం ఆలయ ఆస్థాన మండపంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు నేతృత్వంలో హుండీ

కాణిపాకం హుండీ ఆదాయం లెక్కింపు

చిత్తూరు/ఐరాల: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.91.78,779 వచ్చింది. సోమవారం ఆలయ ఆస్థాన మండపంలో చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు నేతృత్వంలో హుండీ కానుకలను లెక్కించారు. 130 గ్రాముల బంగారు, కేజీ మూడు వందల గ్రాముల వెండి, 594 యూఎ్‌సఏ, 300 సింగపూర్‌, 65 ఆస్ర్టేలియా డాలర్లు, 5 మలేషియా రింగిట్స్‌ సమకూరాయి. 17 రోజులలో ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ లెక్కింపులో పాలక మండలి సభ్యులు నరసింహులుశెట్టి, మారుతీశ్వరరావు, కాంతమ్మ, సుశీల, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు ప్రసాద్‌ శ్రీధర్‌బాబు,కోదండపాణి, యూనియన్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-21T12:10:35+05:30 IST