పురపాలక ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత

ABN , First Publish Date - 2021-12-30T16:28:21+05:30 IST

పురపాలక సంఘాల ఎన్నికల్లో మహిళలకు అధిక సీట్లు కేటాయిండానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ కనిమొళి సూచించారు. తి రువళ్లూర్‌ జిల్లా డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో

పురపాలక ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత

                          - ఎంపీ కనిమొళి సూచన


పెరంబూర్‌(చెన్నై): పురపాలక సంఘాల ఎన్నికల్లో మహిళలకు అధిక సీట్లు కేటాయిండానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలని డీఎంకే ఎంపీ కనిమొళి సూచించారు. తిరువళ్లూర్‌ జిల్లా డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన విద్యార్థులకు, మహిళలను సహాయాల పంపిణీ మంగళవారం రాత్రి తిరువళ్లూర్‌లో జరిగింది. పశుసంవర్ధక శాఖ మంత్రి నాజర్‌, తిరువళ్లూర్‌ ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌, పార్టీ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో కనిమొళి మాట్లాడుతూ, మహిళల హక్కుల పరిరక్షణ, భద్రత కల్పించడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా నేడు పురుషులకు భయపడకుండా ఉద్యోగాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగిందన్నారు. గతంపై తనపై జరిగే వేధింపులను బయటకు చెప్పుకోలేని పరిస్థితి మహిళల్లో నెలకొనివుండేదని, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ అండతో మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేస్తున్నారని కనిమొళి అన్నారు. అనంతరం ఓ ప్రశ్నకు కనిమొళి బదులిస్తూ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నేతృత్వంలో తృతీయ కూటమి ఏర్పాటు ఎన్నికల తర్వాత ఆలోచిస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2021-12-30T16:28:21+05:30 IST