ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డ కనికా కపూర్

ABN , First Publish Date - 2020-04-05T00:59:58+05:30 IST

విషయం తెలుసుకున్న కనిక కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దీని గురించి మాట్లాడుతూ ఆసుపత్రిలోకి వైద్య సిబ్బందికి కనిక బాగా సహకరించారు. కరోనాను ఎదుర్కోవడానికి ఆమె తంత్రాలు ఏవీ ప్రయోగించలేదు

ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డ కనికా కపూర్

ముంబై: బాలీవుడ్ గాయని కనికా కపూర్.. ఎట్టకేలకు కరోనా నుంచి బయటపడ్డారు. ఐదోసారి చేసిన కోవిడ్-19 టెస్టులో ఆమెకు నెగిటీవ్ వచ్చింది. క్రితం నాలుగు సార్లు టెస్టు చేయగా అన్ని సార్లు పాజిటివ్ అనే తేలింది. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఉన్న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ఆమె అక్కడే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రతికూల రిపోర్టులే వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని సమాచారం.


విషయం తెలుసుకున్న కనికా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం దీని గురించి మాట్లాడుతూ ఆసుపత్రిలోకి వైద్య సిబ్బందికి కనిక బాగా సహకరించారు. కరోనాను ఎదుర్కోవడానికి ఆమె తంత్రాలు ఏవీ ప్రయోగించలేదు. మార్చి 9, 2020 నాడు కనికా కపూర్.. లండన్ నుంచి ముంబై వచ్చారు. అయితే ఆమె ఒక భయంకరమైన క్రిమితో యుద్ధం చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదు’’ అని అన్నారు.

Updated Date - 2020-04-05T00:59:58+05:30 IST