Abn logo
Sep 21 2021 @ 01:15AM

కాంగ్రె్‌సలోకి కన్హయ కుమార్‌!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ కుమార్‌, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీలు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. అక్టోబరు 2న నిర్వహించే ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కాంగ్రె్‌సలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా ఈ నెల 28నే చేరే అవకాశం కూడా ఉంది. వచ్చే ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో యువ, శక్తిమంతమైన నేతలను పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.