Abn logo
Sep 17 2020 @ 09:14AM

ఊర్మిళ `పోర్న్‌స్టార్` అంటూ కంగన కామెంట్.. బాలీవుడ్ ఫైర్!

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఊర్మిళా మతోంద్కర్‌ను `స్టాఫ్ట్ పోర్న్‌స్టార్`గా అభివర్ణిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన కామెంట్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు కారణమవుతోంది. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం గురించి ఊర్మిళ మాట్లాడుతూ.. `ఈ డ్రగ్స్ సమస్య దేశం మొత్తం ఉంది. మాదక ద్రవ్యాలకు తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కేంద్ర బిందువు అని కంగనకు తెలుసా? తన సొంత రాష్ట్రం గురించి కంగన ముందు ఆలోచించాల`ని వ్యాఖ్యానించింది. 


ఈ వ్యాఖ్యలపై కంగన ఫైర్ అయింది. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఊర్మిళపై అసభ్యకర కామెంట్స్ చేసింది. `ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్. ఈ మాట కఠినంగా ఉండొచ్చు.. కానీ అదే నిజం. ఆమె గొప్ప నటి అని ఎప్పుడూ నిరూపించుకోలేదు. సాఫ్ట్ పోర్న్ తరహా పాత్రలు చేయడం తప్ప ఆమె చేసిందేముంది. ఆమె రాజకీయాల్లోకి రాగా లేనిది, నేను వస్తే తప్పేముంద`ని కంగన వ్యాఖ్యానించింది. కంగన వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నటులు ఫైర్ అయ్యారు. స్వర భాస్కర్, అనుభవ్ సిన్హా వంటి బాలీవుడ్ ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఊర్మిళ గతంలో నటించిన సినిమాల గురించి ప్రస్తావించారు. 

Advertisement
Advertisement
Advertisement