Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 28 May 2022 14:53:21 IST

కేవలం 20 టికెట్లు.. 4420 రూపాయలు.. ఆ సినిమాకు శుక్రవారం వచ్చిన మొత్తం కలెక్షన్లు ఇంతే..!

twitter-iconwatsapp-iconfb-icon
కేవలం 20 టికెట్లు.. 4420 రూపాయలు.. ఆ సినిమాకు శుక్రవారం వచ్చిన మొత్తం కలెక్షన్లు ఇంతే..!

సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). ఆమె తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్’ (Dhaakad). ప్రపంచవ్యాప్తంగా మే 20న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. తాజాగా ఈ మూవీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సినిమా విడుదలైన ఎనిమిదో రోజు దేశవ్యాప్తంగా 20టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ అమ్మకాల ద్వారా రెండో శుక్రవారం రూ. 4,420లు నెట్ కలెక్షన్స్ వచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


‘ధాకడ్’ హీరోయిన్ ఓరియేంటెడ్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రం పరాజయం కావడంతో మేకర్స్‌కు భారీ నష్టాలు వచ్చాయి. అట్లర్ ప్లాప్ అయిన ఈ సినిమాను కొనేందుకు ఓటీటీలు కూడా భయపడుతున్నాయి. నిర్మాతలు విడుదలకు ముందే శాటిలైట్, డిజిట్ రైట్స్‌ను అమ్మేస్తుంటారు. ఈ హక్కులను ముందుగానే అమ్మడం ద్వారా ప్రొడ్యూసర్స్ లాభాలను అర్జిస్తుంటారు. ‘ధాకడ్’ భారీ విజయం సాధిస్తుందని నిర్మాతలు అంచనా వేసి ఉంటారు. అందువల్ల డిజిటల్ రైట్స్‌ను అమ్మలేదు. రిలీజ్ అనంతరం మంచి డీల్ లభిస్తుందని ఆశించి ఉండవచ్చు. కానీ, సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్(Arjun Rampal) విలన్‌గా నటించాడు. పూర్తి రన్‌లో ఈ మూవీ కేవలం రూ. 3కోట్ల కంటే తక్కువ కలెక్షన్స్‌ను రాబట్టిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement