Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 02 Feb 2022 15:39:20 IST

రియాలిటీ షో హోస్ట్‌గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ Kangana Ranaut..!

twitter-iconwatsapp-iconfb-icon

వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రియాలిటీ షోను హోస్ట్ చేయనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కంగనా రనౌత్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ పోస్ట్ కూడా పెట్టింది. అయితే నిమిషాల వ్యవధిలోనే ఆ పోస్ట్‌ను ఆమె డిలీట్ చేసింది. ఓటీటీ వేదికగా ఏక్తా కపూర్ నిర్మించబోయే రియాలిటీ షోలో కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారట. డేటింగ్, రొమాన్స్ తదితర అంశాలతో రియాలిటీ షో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా 13 మంది నుంచి 15 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొన్నబోతున్నారని సమాచారం. 


అమెరికన్ రియాలిటీ షో ‘టెంప్టేషన్ ఐలాండ్’ను ఆధారంగా చేసుకొని.. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా షోలో అనేక మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఏఎల్‌టీ బాలాజీ, ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంయుక్తంగా ఈ షోను నిర్మించబోతున్నాయి. ఈ వారంలోనే ఈ షోకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే కంగన ఈ విషయాన్ని బయటపెట్టేసింది.  ‘‘నేను మొదటి సారిగా షోను హోస్ట్ చేయబోతున్నాను. ఈ షోకు లేడీ బాస్ ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తోంది’’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కానీ, కొద్ది నిమిషాల అనంతరం కంగన ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement