Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 24 May 2022 14:37:46 IST

నీకెంత ధైర్యం.. ఇక నీ పని ఖతం.. అంటూ Kangana Ranaut ను బెదిరించిన స్టార్ డైరెక్టర్.. అసలేం జరిగిందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

ఏ విషయం గురించైనా ఎటువంటి బెరుకు, మొహమాటం లేకుండా మాట్లాడే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అందుకే ఈ బ్యూటీని అభిమానులు ఫైర్‌బ్రాండ్ అని పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ మీద, అక్కడి స్టార్స్ మీద ఎన్నోసార్లు ఘాటు విమర్శలు చేసింది. 2017లో మాజీ ప్రియుడు హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ మీద రెచ్చిపోయి కామెంట్స్ చేసింది. అంతేకాకుండా 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేశ్ భట్‌పై విమర్శ చేసింది. మరోసారైతే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, నిర్మాత ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఓ సినిమా విషయమై తనను బెదిరించినట్లు కంగన తీవ్ర ఆరోపణలు చేసింది.


సల్మాన్ హీరోగా చేసిన ‘సుల్తాన్ (Sultan)’లో హీరోయిన్‌‌గా నటించే అవకాశం మొదట కంగనకే దక్కింది. దీని గురించి కంగన మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ అలీ జాఫర్ అబ్బాస్ మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు. అనంతరం నిర్మాత ఆదిత్య చోప్రాతో నేను సమావేశం అయ్యి.. సినిమా చేయలేనని ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పాను. ఆ సమయంలో ఆయన బాగానే ఉన్నాడు. కానీ తరువాత.. సుల్తాన్‌ సినిమాని కంగనా తిరస్కరించినట్లు వార్త బయటకు వచ్చింది. అది చూసిన ఆయన నాకు మెసేజ్ చేశాడు. ‘నీకు ఎంత ధైర్యం? నువ్వు నా సినిమా తిరస్కరిస్తావా?. నీ పని అయిపోయిందని అందులో బెదిరించాడు’ అని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


ఈ సినిమాని తిరస్కరించడం గురించి 2017లోనే కంగన వివరణ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంతకుముందు చేసిన చిత్రాల్లో నాకు ఎక్కువ స్పేస్ లభించింది. అందుకే ఈ ఆఫర్‌ని అంగీకరించి నా స్థాయిని తగ్గించుకోవాలని భావించలేదు. సుల్తాన్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ మంచిదే కావొచ్చు. కానీ నాకు తగినదిగా నేను భావించలేదు. అందుకే సినిమాని తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ పాత్రని అనుష్క శర్మ చేయగా.. 2016లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకొని ప్రపంచవ్యాప్తంగా రూ.623 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International