Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Oct 2021 20:30:39 IST

వావ్.. కేవలం పది రోజుల్లోనే Kangana Ranaut ఐదు కిలోల బరువు తగ్గిందట.. ఏమేం పాటించిందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

సినిమాల కోసం నటీ, నటులు బరువును పెరగడం, తగ్గడం చేస్తుంటారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దంగల్ సినిమాలోని మహావీర్ సింగ్ ఫోగట్ పాత్ర కోసం ఆమిర్ ఖాన్ మొదట బరువు పెరిగారు. ముందుగా ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. బరువు తగ్గిన అనంతరం యువకుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేశారు. తాజాగా ఒక హీరోయిన్ తన సినిమాలకు సంబంధించిన పాత్రల కోసం బరువు పెరిగారు. డైట్‌ను ఫాలో అవుతూ తన బరువును తగ్గించుకున్నారు. తన డైట్ ప్లాన్‌‌ను అభిమానులతో పంచుకున్నారు.


మాటలు తూటలా పేల్చే నటి కంగనా రనౌత్. ఆమె సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్. మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. తలైవి, పంగ చిత్రాల కోసం ఆమె బరువు పెరిగారు. కేవలం 10రోజుల్లోనే తన బరువును 5 కిలోల వరకు తగ్గించుకున్నారు. బరువును తగ్గించుకోవడానికి పైలేట్ వ్యాయమాలు చేశారు. ఫిట్‌గా ఉండటానికి యోగా, డ్యాన్స్‌ను కూడా ఆశ్రయించారు. మనసును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం కూడా చేశారు.


వర్కౌట్‌లు చేసినంత మాత్రాన బరువు తగ్గరని కంగనాకు తెలుసు. అందుకే వ్యాయామాలు చేయడంతో పాటు డైట్‌ను ఫాలో అయ్యారు. నూనె, జంక్ పదార్థాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనాన్ని 8గంటల లోపు ముగించారు. ఉడకబెట్టిన కూరగాయలతో పాటు, వెజిటెబుల్ సూప్, సలాడ్‌లను రాత్రి భోజన సమయంలో విరివిగా తీసుకున్నారు. ఇవన్ని పాటించడంతో 10రోజుల్లోనే 5కిలోల వరకు బరువును తగ్గించుకున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement