Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 15 Nov 2021 12:22:26 IST

Kangana Ranaut షేర్ చేసిన ‘నెహ్రు రాసిన లేఖ’లో... ఏముంది?

twitter-iconwatsapp-iconfb-icon
Kangana Ranaut షేర్ చేసిన నెహ్రు రాసిన లేఖలో... ఏముంది?

కంగనా రనౌత్‌కి, ఆమెని విమర్శించే వారికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజాగా ఆమె తొలి ప్రధాని నెహ్రుని కూడా కాంట్రవర్సీలోకి లాగింది. కాంగ్రెస్ పార్టీని మరోసారి పలు చారిత్రక తప్పిదాలకు కారణంగా పేర్కొంది. బీబీసి వారి ఒక ఓల్డ్ ఆర్టికల్‌ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఆనాటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌ను దోషిగా ఎత్తి చూపింది. ‘‘1947లో మనకు వచ్చింది ‘భిక్ష’ మాత్రమే’’ అన్న కామెంట్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉంటానని కంగనా చెప్పకనే చెప్పింది... 

Kangana Ranaut షేర్ చేసిన నెహ్రు రాసిన లేఖలో... ఏముంది?

2014లో మోదీ ప్రధాని అవ్వటంతోనే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్న కంగనా మాటలు చాలా మందిని భగ్గుమనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లోని వారు, రాజకీయాల్లోని వారు, సామాన్య నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే, ఆమెకు మద్దతు పలుకుతోన్న కామన్ పీపుల్, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా తన మాటకి బలం చేకూరేలా మరోసారి కంగనా సొషల్ మీడియాలో బలంగా వాదన వినిపించింది. మొదట బీబీసీ వారి ‘‘వై బ్రిటన్ డజ్ నాట్ ఓవ్ రెపరేషన్స్ టూ ఇండియా’’ అనే 2015 నాటి వ్యాసాన్ని షేర్ చేసింది. దాని గురించి ప్రస్తావిస్తూ వందల ఏళ్లు మన దేశాన్ని దోచుకున్నది కాక బీబీసి వాళ్లు ‘భారత్‌కి బ్రిటన్ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదు’ అంటూ వ్యాసాలు రాస్తున్నారని ఎద్దేవ చేసింది. దేశ విభజన కాలం నాటి బ్రిటీష్ పీఎం విన్‌స్టన్ చర్చిల్ ఎంతో ఆస్తి నష్టానికి, లక్షలాది మంది భారతీయుల ప్రాణాలు పోవటానికి కారణం అని కూడా కంగనా తెలిపింది. ఇండియాని రెండు ముక్కలు చేసిన సమయంలో మత కలహాలు చెలరేగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాదానికి ఇంగ్లాండ్ పాలకులు, కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలని కూడా ఆమె అంటోంది. 

Kangana Ranaut షేర్ చేసిన నెహ్రు రాసిన లేఖలో... ఏముంది?

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో 1948 నాటి నెహ్రు రాసిన లేఖని కూడా జత చేసింది. అందులో బ్రిటన్ మహారాణిని ‘యువర్ మెజెస్టీ’ అంటూ ప్రధాని జవహర్‌లాల్ పేర్కొనటం, చక్రవర్తుల రాజగోపాలచారిని భారతదేశ గవర్నర్ జనరల్‌గా నియమించమని ఆమెని అభ్యర్థించటం మనం చూడవచ్చు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఆ మరుసటి సంవత్సరం కూడా బ్రిటన్ రాణికి లేఖ రాయాల్సిన అవసరం ఏంటని కంగనా ప్రశ్నిస్తోంది! కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ బ్రిటన్ ఆధిపత్యాన్ని ధిక్కరించే ఉద్దేశమే లేదని ఆమె చివరగా పేర్కొంది.    

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement