బీజేపీకి మద్దతుగా 2022 ఎన్నికల్లో ప్రచారం.. Kangana Ranaut ఏమందంటే..

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు కంగనా రనౌత్. ఈ బ్యూటీ తాజాగా బృందావన్‌లో కృష్ణ దర్శన్నాన్ని సందర్శించింది. అనంతరం వీలేకరులతో మాట్లాడింది ఈ తార.


2022లో బీజేపీ తరపున ప్రచారం చేసే అవకాశం ఉందా అని అడగగా.. ‘నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. ఎవరైతే జాతీయవాదాన్ని ఫాలో అవుతారో వారికి కేంపెయిన్ చేస్తా. నిజాయితీ, ధైర్యం, జాతీయవాదం, దేశం గురించి ఆలోచించే వారికి నేను చెబుతున్నది సరైనదేనని అనిపిస్తుంద‌’ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నిజమైన శ్రీ కృష్ణ జన్మస్థానం ఏదో ప్రజలకి చూపే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పింది. అయితే కొన్ని నివేదికల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో ఈద్గా ఉందని కంగనా పేర్కొంది.


అంతేకాకుండా వారాణాసి టూర్‌కి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగనా. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం అర్జున్ రాంపాల్, దివ్య దత్తాతో కలిసి ‘ధాకడ్’ అనే చిత్రంలో నటిస్తోంది. సర్వేష్ మేవారా దర్శకత్వంలో ‘తేజస్’ మూవీ చేస్తోంది. అంతేకాకుండా నవాజుద్దిన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ లీడ్ రోల్‌లో ‘టీకీ వెడ్స్ షేరు’ అనే సినిమాని నిర్మిస్తోంది.


Advertisement

Bollywoodమరిన్ని...