Abn logo
Apr 7 2020 @ 16:24PM

నాలుగు షేడ్స్‌లో కంగ‌నా రనౌత్‌..!

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్  పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా మ‌రో దివంగ‌త నేత క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. ప్రియ‌మ‌ణి శ‌శిక‌ళ పాత్ర‌లో న‌టిస్తుంది. 


కాగా.. ఈ సినిమాలో కంగనా నాలుగు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నారు. జ‌య‌ల‌లిత 18 వ‌య‌సు నుండి 60 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు కంగ‌నా క‌న‌ప‌డుతుంది. జ‌య‌ల‌లిత జీవితంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్నార‌ని టాక్‌. డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement