Abn logo
Sep 20 2020 @ 15:11PM

అగ్ర హీరోలతో నాకు చేదు అనుభవాలున్నాయి: కంగనా

Kaakateeya

అనురాగ్‌ కశ్యప్‌, పాయల్ ఘోష్‌ మధ్య జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంలో ఇప్పుడు కంగనా ఎంట్రీ ఇచ్చారు. తనదైన శైలిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, అనురాగ్‌ కశ్యప్‌పై విమర్శలు చేశారు కంగనా. "పాయల్‌ ఘోష్‌ ఎలాంటి పరిస్థితినైతే ఎదుర్కొందో అలాంటి పరిస్థితిని అగ్రహీరోలతో నేను ఎదుర్కొన్నాను. వారి వాన్‌, రూమ్‌ డోర్‌ లాక్‌ అయినప్పుడో, పార్టీలోనో, ఫ్రెండ్లీగా డాన్స్‌ చేసే సమయంలోనో వారి జనేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. మన నోట్లో వారి నాలుకను అతికించడానికి ప్రయత్నిస్తారు. పనుందంటూ మన అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఇంటికొస్తారు. మనల్ని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తారు. నాకు తెలిసినంత వరకు అనురాగ్‌ కశ్యప్‌ ఏకపత్నీ వ్రతుడిగాఉండలేదు. తను చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడు. పాయల్‌తో అనురాగ్‌ ఎలా ప్రవర్తించాడో అది బాలీవుడ్‌లో సాధారణంగా జరిగే విషయమే. ఇండస్ట్రీలోని అవుట్‌ సైడర్స్‌ అయిన అమ్మాయిలను సెక్స్‌ వర్కర్స్‌గా భావించి ఇబ్బందులకు గురి చేస్తుంటారు" అని అన్నారు కంగనా రనౌత్‌. 



Advertisement
Advertisement
Advertisement