Abn logo
Sep 22 2020 @ 09:40AM

డ్రగ్స్‌ కేసులో దీపిక.. కంగన సెటైర్లు!

Kaakateeya

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం కేసు విచార‌ణ పూర్తిగా డ్ర‌గ్స్ మ‌లుపు తీసుకుంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి వాట్సాప్ ఛాట్ ద్వారా ప‌లువురు డ్ర‌గ్స్ డీల‌ర్ల గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని వార్తలు వస్తున్నాయి. వారి ద్వారా బాలీవుడ్ లో ఎవ‌రెవ‌రికి డ్ర‌గ్స్ అందాయ‌నే అంశం గురించి ఆధారాలు ల‌భించిన‌‌ట్టు సమాచారం.


తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు తెర మీదకు వచ్చింది. దీంతో దీపికపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీపిక గతంలో మానసిక కుంగుబాటుకు గురైన సంగతి తెలిసిందే. దానిని డ్రగ్స్ కేసుకు ముడిపెడుతూ కంగన ట్వీట్ చేసింది. `డ్రగ్స్ వాడకానికి పర్యావసానమే డిప్రెషన్. క్లాస్‌గా కనబడే ధనవంతులైన స్టార్ పిల్లలు వాళ్ల మేనేజర్లను మాల్ గురించి అడుగుతుంటారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడే వాళ్లను, దీపికా పదుకొనేను బాయ్‌కాట్ చేయాల`ని కంగన పేర్కొంది. 



Advertisement
Advertisement
Advertisement