Advertisement
Advertisement
Abn logo
Advertisement

అది నిజమే.. ఫైనల్‌లో ఓటమిపై కివీస్ కెప్టెన్

దుబాయ్: ఓటమి కొంత బాధాకరమైనదేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కేన్.. ఓటమి తమను తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా తమకు కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదని అంగీకరించాడు. 


గతంలో 2015 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై, 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఓడిన న్యూజిలాండ్‌ తాజాగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఆడుతునప్పుడు గెలుపోటములు చాలా సహజమైనవేనని, ఏరోజైనా అవి జరుగుతుంటాయని అందుకు సిద్ధంగా ఉండాలని అన్నాడు.  


ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడిందని, తమకు ఒక అంగుళం అవకాశం కూడా ఇవ్వలేదని కేన్ ప్రశంసించాడు. ఓటమి బాధ కలిగించినప్పటికీ తమ ఆట తీరుకు గర్వపడుతున్నామన్నాడు.


ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ అవకాశాలు సృష్టించుకోలేకపోయిందన్న విమర్శలకు కివీస్ కెప్టెన్ అవుననే అన్నాడు. ప్రత్యర్థి ఎదుట సవాలు చేసే లక్ష్యాన్ని ఉంచినప్పటికీ దురదృష్టవశాత్తు అవకాశాలను సృష్టించుకోలేకపోయామని, ఇది కొంత నిరాశ కలిగించిందని అన్నాడు.    

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement