కందుకూరు కేజీబీవీకి స్వచ్ఛ విద్యాలయ అవార్డు

ABN , First Publish Date - 2022-07-02T03:24:16+05:30 IST

కందుకూరులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)కి స్వచ్ఛ విద్యాలయ అవార్డు లభించింది. ఒంగోలులో

కందుకూరు కేజీబీవీకి స్వచ్ఛ విద్యాలయ అవార్డు
స్వచ్ఛ విద్యాలయ అవార్డును అందుకుంటున్న కందుకూరు కేజీబీవీ ఎస్‌వో స్వాతి, సీఆర్పీ ప్రతిభ

కందుకూరు, జూలై 1: కందుకూరులోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)కి స్వచ్ఛ విద్యాలయ అవార్డు లభించింది. ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జడ్పీ  చైౖర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా కలెక్టర్‌ల చేతుల మీదుగా కేజీబీవీ ఎస్‌వో స్వాతి, సీఆర్పీ పీఎస్‌ ప్రతిభలు ఈ అవార్డును అందుకున్నారు. మండలంలోని మహదేవపురం ఎంపీయూపీ స్కూల్‌కు కూడా స్వచ్ఛ విద్యాలయ అవార్డు దక్కింది. పాఠశాల హెచ్‌ఎం భిక్షాలు, సీఆర్పీ ఆర్‌. కిరణ్‌లు ఈ అవార్డుని అందుకున్నారు. 


అంకభూపాలపురం పాఠశాలకు..


వలేటివారిపాలెం, జూలై 1: మండలంలోని అంకభూపాల పురం ఎంపీయూపీ స్కూల్‌కు జాతీయ స్వచ్ఛ విద్యాలయ అవార్డు లబించింది.  ఒంగోలులో శుక్రవారం జిల్లా కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, డీఈవో, ఏపీసీల చేతుల మీదుగా ప్రదానోపాధ్యాయుడు కే మోహన్‌రావు అవార్డు అందుకున్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన సీఆర్పీ రాజేష్‌, ఎంఈవో రవికుమార్‌కు, బోధనేతర సిబ్బందికి హెచ్‌ఎం అభినందనలు తెలిపారు.



Updated Date - 2022-07-02T03:24:16+05:30 IST