పాఠశాల స్థలాన్ని ఆక్రమిస్తున్నా పట్టించుకోరా ?

ABN , First Publish Date - 2022-01-18T06:16:45+05:30 IST

ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నా పట్టించుకోరా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనంతోపాటు కాన్వాయ్‌ని అడ్డుకున్న ఘటన సోమవారం గంగాధరనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది.

పాఠశాల స్థలాన్ని ఆక్రమిస్తున్నా పట్టించుకోరా ?
ఫ్ల్లకార్డులతో ధర్నా చేస్తున్న విద్యార్థులు, పెద్దలు

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డగించిన కండ్రిగ దళితవాడవాసులు


గంగాధరనెల్లూరు, జనవరి 17: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమిస్తున్నా పట్టించుకోరా అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనంతోపాటు కాన్వాయ్‌ని అడ్డుకున్న ఘటన సోమవారం గంగాధరనెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. తూగుండ్రం పంచాయతీ తాటిమాకులకండ్రిగ ఆదిఆంధ్రవాడలో ఓ కార్యక్రమానికి అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం వెళుతున్నారని తెలుసుకున్న కండ్రిగ దళితవాడ చిన్నారులతోపాటు పెద్దలు ఫ్లకార్డులు చేతబట్టి రోడ్డుపై ధర్నా చేసి అడ్డుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ళకు ముందు ఆవలకొండకు చెందిన ముస్లిమ్‌ జమీందారు కుటుంబీకులు పాఠశాల కోసం స్థలం కేటాయించారని, అయితే జమీందారు వంశానికి చెందిన ఓ వ్యక్తి మరొకరికి స్థలాన్ని విక్రయించారని, ఆ పాఠశాల స్థలంలో గోతులు తవ్వి, బేస్‌మెంట్‌ రాళ్ళుతోలారని, ఆక్రమణను తొలగించి స్థలాన్ని పాఠశాలకే ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు వివరించారు. పాఠశాల స్థలంలో ఆక్రమణలు తొలగించి ఇకపై ఆక్రమించుకోవడానికి వీలులేకుండా చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. 



Updated Date - 2022-01-18T06:16:45+05:30 IST