Kanchipuram జిల్లాలో మాస్కు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-06-22T15:43:57+05:30 IST

కాంచీపురం జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయడంతో నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Kanchipuram జిల్లాలో మాస్కు తప్పనిసరి

చెన్నై, జూన్‌ 21: కాంచీపురం జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను వేగవంతం చేయడంతో నిబంధనలు తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో, కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేలూరు జిల్లాల్లో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆ జిల్లా కలెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో, కాంచీపురం జిల్లాలోనూ నిబంధనలు కఠినతరం చేశారు. బహిరంగ ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా మాస్క్‌ ధరించాలని, మాస్క్‌ లేకుంటే జరిమానా విధిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. అలాగే, మాల్స్‌, వాణిజ్య దుకాణాల్లో ఏసీలు వినియోగించరాదని, అంత్యక్రియల్లో 50 మంది మాత్రమే పాల్గొనాలని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-22T15:43:57+05:30 IST