ఆసూరులో ఐదు వేల ఏళ్లనాటి రాతి సమాధి

ABN , First Publish Date - 2022-09-22T16:34:23+05:30 IST

కాంచీపురం జిల్లా(Kanchipuram District) వాలాజాబాద్‌ సమీపంలోని ఆసూరు గ్రామంలో ఐదే వేల ఏళ్లనాటి ప్రాచీన రాతి సమాధి కనుగొన్నట్లు తమిళ

ఆసూరులో ఐదు వేల ఏళ్లనాటి రాతి సమాధి

ఐసిఎఫ్‌(చెన్నై), సెప్టెంబరు 21: కాంచీపురం జిల్లా(Kanchipuram District) వాలాజాబాద్‌ సమీపంలోని ఆసూరు గ్రామంలో ఐదే వేల ఏళ్లనాటి ప్రాచీన రాతి సమాధి కనుగొన్నట్లు తమిళ చరిత్ర పరిశోధన కేంద్ర వ్యవస్థాపకులు వెట్రితమిళన్‌ తెలిపారు. ప్రాచీనకాలాల్లో మరణించిన వారి భౌతికదేహాలు వివిధ పద్ధతుల్లో ఖననం చేసేవారు. ముఖ్యంగా, పెద్ద మట్టి పాత్రలో ఉంచి పూడ్చే విధానానికి ‘ముదుమక్కల్‌ తాళి’ అనే పేరు పెట్టి పిలిచేవారు. అలాగే, వృత్తాకారంలోని చిన్న రాతి బండలపై పెద్ద రాతిబండలు ఉంచి కప్పి వేయడాన్ని ‘కల్‌ తిట్టై’ అని వ్యవహరించేవారు. నేలలో సగం వరకు పూడుకుపోయేలా రాళ్లు పాతి, దానిపై పెద్ద బండతో మూసివేయడాన్ని ‘కల్‌ పదుక్కై’ అనేవారు. ప్రస్తుతం ఆసూరు గ్రామంలో సుమారు ఐదు వేల ఏళ్లనాటి ప్రాచీన కల్‌ తిట్టై గుర్తించామని, పురావస్తు పరిశోధనల అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-09-22T16:34:23+05:30 IST