దానగుణం పెంచుకోవాలి

ABN , First Publish Date - 2022-07-04T06:47:56+05:30 IST

ప్రతి ఒక్కరూ సేవ, సహకారంతో ఉండాలని, భగవదారాధనతో అనుగ్రహం ప్రాప్తిస్తుం దని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు.

దానగుణం పెంచుకోవాలి
స్వామిజీకి భక్తుల స్వాగతం

కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ

ఏలూరు కార్పొరేషన్‌, జులై 3 : ప్రతి ఒక్కరూ సేవ, సహకారంతో ఉండాలని, భగవదారాధనతో అనుగ్రహం ప్రాప్తిస్తుం దని  కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. స్థానిక పవరుపేటలోని చదలవాడవారి వీధిలో  నిర్మించిన వేద స్మార్త ప్రయోగ పాఠశాల నూతన భవనానికి స్వామీజీ ఆదివారం విచ్చేయగా భక్తులు, నిర్వాహకులు పూర్ణ కుంభంతో  స్వాగతం పలికారు. గోపూజ, శ్రీ మహా త్రిపురసుందరీ సమేత చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం, త్రికాల అర్చన నిర్వహించారు. అనంతరం స్వామిజీ  అనుగ్రహ భాషణం చేశారు. శాంతి, సామరస్యతకే ప్రాధాన్యత చూపాలని, పరస్పర సహకారం, దానగుణం పెంపొందించుకోవాలన్నారు. వేద పాఠశాల అధ్యక్షులు ఈదర వెంకట రమణప్రసాద్‌, కార్యదర్శి తూములూరి విశ్వనాధ శాస్త్రి, సహాయ కార్యదర్శి జోస్యుల జయేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. సోమవారం కూడా  స్వామిజీ   పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. 


Updated Date - 2022-07-04T06:47:56+05:30 IST