ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కారణం: కనకమేడల

ABN , First Publish Date - 2021-09-30T21:34:07+05:30 IST

ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కారణం: కనకమేడల

ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కారణం: కనకమేడల

అమరావతి: బ్యూటీఫికేషన్ మాత్రమే కాదు....సౌకర్యాలు ఇవ్వాలని కోరాను అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. నదికుడి - శ్రీకాళహస్తి 309.km లైన్ పనులు ఆగిపోయిందన్నారు. 1351 కోట్లు రాష్ట్ర వాటా ఇవ్వక పోవడం వల్లనే నడికుడి - శ్రీకాళహస్తి ఆగిపోయిందని చెప్పారు. కడప - బెంగుళూరు పనులు పెండింగ్‌లో ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే కారణమని పేర్కొన్నారు. కోటిపల్లి - నర్సాపూర్ పనులు ఆగిపోవడానికి రాష్ట్ర వాటా ఇవ్వక పోవడమే కారణమని స్పష్టం చేశారు. రాష్ట్ర వాటాగా ఈ ప్రాజెక్ట్‌లో 2.69 కోట్లు మాత్రమే డిపాజిట్ చేశారని చెప్పారు. ఇవన్నీ స్వయంగా రైల్ వే GM అధికారికంగా చెప్పారని పేర్కొన్నారు.  

Updated Date - 2021-09-30T21:34:07+05:30 IST