15 నుంచి కనకమ్మ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-05T05:37:16+05:30 IST

కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి నెలరోజులపాటు మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు తెలిపారు.

15 నుంచి కనకమ్మ ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గోవిందరావు

 సమన్వయ కమిటీ సమావేశంలో జేసీ గోవిందరావు

వన్‌టౌన్‌, డిసెంబరు 4: కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి నెలరోజులపాటు మార్గశిర మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు చేపట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయకమిటీ సమావేశం శుక్రవారం దేవాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం వేగంగా జరిగేలా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. ఆలయ ఈవో జ్యోతిమాధవి మాట్లాడుతూ లక్షలాది మంది తరలివచ్చే ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని విభాగాలవారు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కోవిడ్‌ నిబంధనల మేరకు దర్శన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులు ముందుగానే దర్శనం స్లాట్‌లు రిజర్వ్‌ చేసుకోవాలని, రిజర్వ్‌ స్లిప్‌తో వచ్చిన వారికి మాత్రమే దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఈ స్లాట్‌ స్లిప్స్‌ అంబికాబాగ్‌ రామాలయం, జేఎన్‌చౌలీ్ట్ర, జగన్నాథస్వామి ఆలయాల్లో లభిస్తాయని తెలిపారు. మాస్క్‌ తప్పనిసరని, మాస్క్‌లేని వారిని అనుమతించమని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-05T05:37:16+05:30 IST