Vijayawada: శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో బెజవాడ కనకదుర్గ

ABN , First Publish Date - 2022-10-05T12:44:01+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

Vijayawada: శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో బెజవాడ కనకదుర్గ

విజయవాడ (Vijayawada): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బుధవారం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.. షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణి మహాత్రిపుర సుందరి, శ్రీచక్ర అధిష్టానదేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించిది కాబట్టి విజయ అని అంటారు. పరమశాంతి రూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడ చేతితో పట్టుకుని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది. 


రాజరాజేశ్వరీ దేవిని సేవించడం వలన జీవితం ధన్యమవుతుందని, నవరాత్రుల పుణ్యపలం సకల శుభాలు, విజయాలు సిధ్దిస్తాయని భక్తుల విశ్వాసం ఈ రోజు సాయంత్రం ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివివాహారం చేస్తారు. అయితే ఈ ఏడాది నదీ ప్రవాహాం ఉదృతంగా ఉన్న నేపధ్యంలో ఒడ్డునే హంస వాహనం ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు

Updated Date - 2022-10-05T12:44:01+05:30 IST