Advertisement
Advertisement
Abn logo
Advertisement

విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇంటి దొంగలు.. అమ్మవారి సొమ్ముకు రక్షణేది?

విజయవాడ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నా,  సిబ్బంది నిబంధనలు పాటించకపోయినా ఉన్నతాధికారులు మాత్రం స్పందించరు. దీంతో అక్కడ కొంతమంది సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆలయ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు. కాంట్రాక్టులు, అక్రమ పోస్టింగులు, ఒకే సీటులో పదేళ్లుగా కదలకపోవడం వంటి అంశాలపై అందరికీ తెలిసినా చర్యలు తీసుకునే వారు మాత్రం కానరావడంలేదు. 


విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను లక్షలాది మంది భక్తులు ఆరాధ్య దేవతగా కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్ర్రాల నుంచి కూడా భారీగా తరలివచ్చి అమ్మకు మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఆ తల్లి చల్లగా చూడాలని, తప్పు చేస్తే శిక్షిస్తుందనే భయంతో ఉంటారు. అటువంటి దుర్గమ్మ సన్నిధిలో కొలువులు వెలగబెడుతున్న కొంతమంది ఉద్యోగులు మాత్రం అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులను కూడా ముందు నుంచే ప్రసన్నం చేసుకోవడం, ఆరోపణలు రాగానే విచారణ పేరుతో చర్యలు లేకుండా వివాదం ముగించడం పరిపాటిగా మారింది. 


ఇందుకు ఇటీవల కొండపై జరిగిన చాలా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈవోలు మారుతున్నా సీనియర్లు అని చెప్పుకునే సిబ్బంది సెక్షన్లు మారినా కొందరు మాత్రం వీడరు. దీంతో వారికి ఎక్కడెక్కడ లోసుగులు ఉంటాయి. ఏయే మార్గాల్లో అమ్మవారి సొమ్మును అక్రమంగా దోచుకోవచ్చు అనే అంశాలపై పట్టు సాధించారు. దీంతో సెక్షన్ ఏదైనా వారి హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. 


Advertisement
Advertisement