Abn logo
Sep 30 2020 @ 19:49PM

వీళ్లకీ అలాంటి శిక్షే విధించాలి: కంగన

Kaakateeya

హత్రాస్ అత్యాచార బాధితురాలి మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించారు. ఆమె ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.


ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. హైదరాబాద్‌లో దిశ హంతకులకు విధించిన శిక్షనే వీరికీ విధించాలని ట్వీట్ చేసింది. `యోగీ ఆదిత్యానాథ్ గారూ.. మీపై నాకు చాలా నమ్మకముంది. దిశ హంతకులకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షనే వీళ్లకీ విధించాల`ని ట్వీట్ చేసింది. 



Advertisement
Advertisement
Advertisement