కంపచెట్లే.. తరగతి గదులు

ABN , First Publish Date - 2022-06-23T05:30:00+05:30 IST

కంపచెట్లే.. తరగతి గదులు

కంపచెట్లే.. తరగతి గదులు
మంతట్టి పాఠశాలలో పనులు జరుగుతుండటంతో కంపచెట్లలో కూర్చున్న విద్యార్థులు


  • పాఠశాలలు ప్రారంభమైనా పూర్తికాని పనులు 
  • చెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు

బషీరాబాద్‌, జూన్‌ 23: కనీస సౌకర్యాలు కల్పించి ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రకటించిన మన ఊరు- మనబడి కింద పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది. అయితే, పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన ఊరు- మన బడి పథకం కింద మంతట్టి పాఠశాలకు రూ.4లక్షల79వేల 606 కేటాయించారు. దీంతో ఆవరణలో సంప్‌ నిర్మాణం, తరగతి గదుల్లో ఫ్లోరింగ్‌, కరెంట్‌ వంటి పనులు జరుగుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటుతున్నా ఇంకా పనులు పూర్తి కాలేదు. దీంతో ఉపాధ్యాయులు పిల్లలను భవనాల వెనక చెట్ల కింద, చిన్న పొదల మధ్యన కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. కంపచెట్లలో విష పురుగులు ఉంటాయని, అవి విద్యార్థులను కాటేసే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-23T05:30:00+05:30 IST