కమ్ముకొస్తున్న కరోనా!

ABN , First Publish Date - 2022-01-23T06:19:34+05:30 IST

కమ్ముకొస్తున్న కరోనా!

కమ్ముకొస్తున్న కరోనా!
ఉయ్యూరులో కొవిడ్‌ పరీక్షలు

పీహెచ్‌సీల్లో పరిమితంగా పరీక్షలు

మెడికల్‌ షాపులు, ల్యాబ్‌ల వద్ద బాధితుల బారులు

ఉయ్యూరు, జనవరి 22 : ఉయ్యూ రు, మండల పరిధి గ్రామాల్లో  కరోనా కమ్ముకొస్తోంది. నగర పరిధితో పాటు గ్రామాల్లో వందల సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో టెస్ట్‌ల కోసం ల్యాబ్‌లు, మందుల కోసం మందుల షాపులు, ఆర్‌ఎంపీల వద్దకు ప్రజలు ఎగబడుతున్నారు. ఉయ్యూరు, పరిసరాల్లో  అధికారికంగా పదుల  సంఖ్యలో పాజిటివ్‌  కేసులు ఉన్నట్టు  లెక్కల్లో చూపుతుండగా అనధికారికంగా వందల సంఖ్యలో కరోనా బారినపడి ప్రైవేట్‌ వైద్యశాలలు, ఆర్‌ఎం పీలు, మందుల షాపుల వద్ద చికిత్స పొం దుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆధీనంలో చేస్తున్న  కరోనా టెస్ట్‌ల రిపోర్టు రావడానికి 4 నుంచి వారం రోజుల వరకు పడుతున్న నేపథ్యంలో ఎక్కువ ఫీజు చెల్లించి ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో రోజుకు 15నుంచి 20 మందికి మాత్రమే టెస్ట్‌లు చేస్తుండగా,  బాధితులు  ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్ల వలసి వస్తుంది. సంక్రాంతి సందర్భంగా బోళ్లపాడు, ఆకునూరు గ్రామాల్లో కోడిపంలు, కాయ్‌ రాజా  కాయ్‌ బరులు ఏర్పాటు చేయగా వాటివద్ద స్థానికులతో  పాటు అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమి కూడారు. ఈ రెం డు గ్రామాల్లో కూడా పాజిటివ్‌ కేసులు రోజురోజు బయటప డుతున్నట్టు సమాచారం. 

 చిన ఓగిరాల పీహెచ్‌సీలో ముగ్గురికి పాజిటివ్‌

చినఓగిరాల ప్రాథమిక ఆరోగ ్య కేంద్రంలో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీం తో శనివారం ఆరోగ్య కేంద్రాన్ని శానిటైజ్‌ చేయించి మూసి వేసినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి రాకేష్‌ అనిల్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-23T06:19:34+05:30 IST