కమ్మవారిపేటలో కోలాహలంగా Jallikattu

ABN , First Publish Date - 2022-01-25T18:07:51+05:30 IST

జిల్లా యంత్రాంగం అనుమతులతో పలు గ్రామా ల్లో సోమవారం జల్లికట్టు పోటీలు నిర్వహించారు. జిల్లాలో జల్లికట్టు పోటీల నిర్వహణకు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల కలెక్టర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో

కమ్మవారిపేటలో కోలాహలంగా Jallikattu

వేలూరు(చెన్నై): జిల్లా యంత్రాంగం అనుమతులతో పలు గ్రామా ల్లో సోమవారం జల్లికట్టు పోటీలు నిర్వహించారు. జిల్లాలో జల్లికట్టు పోటీల నిర్వహణకు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ఇటీవల కలెక్టర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో స్థానిక సత్తువాచేరిలోని కలెక్టర్‌ కార్యాలయంలో జల్లికట్టు పోటీల నిర్వాహకులతో కలెక్టర్‌ కుమరవేల్‌ పాండ్యన్‌ సమావేశమయ్యారు. సమావేశంలో జల్లికట్టు గ్రూపు సభ్యుడు మిట్టల్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో తాత్కాలికంగా నిలిపివేసిన జల్లికట్టు పోటీలను నిబంధనల మేరకు నడుపవచ్చని సమావేశంలో తీర్మానించారు. దీంతో, సోమవారం కమ్మవారిపేట సహా పలు గ్రామాల్లో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిట్టల్‌ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు నిబంధనలు పాటించి జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నామన్నారు. జిల్లాలో 190 ప్రాంతాల్లో ఈ పోటీలకు జిల్లా యంత్రాంగం అనుమతించిందని తెలిపారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రాంతాల్లో పోటీలను నిలిపివేస్తామని, భవిష్యత్తులో కూడా ఆయా ప్రాంతాల్లో పోటీలు నిర్వహించేందుకు అనుమతించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-25T18:07:51+05:30 IST