Anantapur: భారీ వరదకు కుంగిన కంబదూరు కల్వర్ట్

ABN , First Publish Date - 2022-08-16T20:10:37+05:30 IST

జిల్లాలోని పేరూర్ డ్యాం గేట్లు ఎత్తివేయడంతో నీటి ఉధృతికి కంబదూరు మార్గంలో కల్వర్ట్ కుంగిపోయింది.

Anantapur: భారీ వరదకు కుంగిన కంబదూరు కల్వర్ట్

అనంతపురం: జిల్లాలోని పేరూర్ డ్యాం (Peru dam) గేట్లు ఎత్తివేయడంతో నీటి ఉధృతికి కంబదూరు మార్గంలో కల్వర్ట్ కుంగిపోయింది. దీంతో ఆ మార్గంలో 15 రోజులుగా రాకపోకలు నిలిచారు. మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala sunita) కల్వర్టును పరిశీలించారు. గ్రామస్తుల విజ్ఞప్తితో మరమ్మతుల కోసం  సునీత ట్రాక్టర్లను పంపారు. కాగా... మరమ్మతు పనులు చేస్తున్న టీడీపీ నేతల (TDP Leaders)పై పోలీసులు మండిపడ్డారు. ఆపై వాహనాలను స్వాధీనం చేసుకుని వైపీపీ శ్రేణులకు అప్పగించారు. టీడీపీ నేతల వాహనాలతో వైసీపీ నేతలు (YCP Leader) కల్వర్టు పనులు చేపట్టారు.  పోలీసుల వైఖరిపై పరిటాల సునీత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 

Updated Date - 2022-08-16T20:10:37+05:30 IST