Advertisement
Advertisement
Abn logo
Advertisement

కామాక్షితాయి సేవలో హైకోర్టు జడ్జీ

బుచ్చిరెడ్డిపాళెం/ నెల్లూరు (రూరల్‌),నవంబరు27: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని హైకోర్టు జడ్జీ  కే విజయలక్ష్మి శనివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె గోత్ర నామాలతో స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు  చేయించారు. ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, చైర్మన్‌ చీమల రమేష్‌బాబు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.  ఆమె వెంట నెల్లూరు అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జీ సీ యామిని, జిల్లా ప్రఽధాన న్యాయమూర్తి ఎన్‌. రాజశేఖర్‌, ప్రొటోకాల్‌ జడ్జీ, కోవూరు జుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ వైజే పద్మశ్రీ ఉన్నారు.


  జడ్జీని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు


 నెల్లూరుకు వచ్చిన హైకోర్టు జడ్జీ, జిల్లా పోర్ట్‌ పోలియో జడ్జీ కే విజయలక్ష్మిని న్యాయశాఖ ఉద్యోగులు శనివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.  న్యాయశాఖలో ఉన్న ఖాళీలను   వెంటనే భర్తీ చేయాలని  ఆమెకు విజ్ఞప్తి చేశా రు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.   జడ్జీని కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి పీవీ నారాయణరెడ్డి, నరసింహరావు,  చక్రవర్తి, రవికుమార్‌, శివకుమార్‌, ఆర్‌వీ రమణయ్య, గిరి తదితరులు ఉన్నారు.


Advertisement
Advertisement