కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మండలం శాబ్దిపుర్ గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో వైభవి(8)అనే చిన్నారి మృతి చెందగా, తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి బైక్ పై సిద్దిపేట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి