Abn logo
Nov 26 2021 @ 10:15AM

Kamareddy: గుండెపోటుతో వరి కొనుగోలు కేంద్ర వద్ద రైతు మృతి

కామారెడ్డి: వరి కొనుగోలు కేంద్రం వద్ద ఓ రైతు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య (50) గుండె పోటుతో వరి కొనుగోలు కేంద్రం వద్ద మృతి చెందాడు. కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన వడ్ల కుప్పను ఒక దగ్గరకు చేసి రాజయ్య అక్కడే కుప్పకూలి పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన రైతుకు భార్య రాజవ్వ, కుమారుడు నిఖిల్, కూతురు నిఖిత ఉన్నారు. రాజయ్య మృతి వార్త విన్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption