సీక్రెట్ కోడ్, పిన్ నంబర్ వెల్లడించకపోయినా...రూ.87వేలు మాయం

ABN , First Publish Date - 2022-06-16T14:36:08+05:30 IST

సీక్రెట్ కోడ్, పిన్ నంబర్ వంటివి వెల్లడించకపోయినా అకౌంట్లోని నుంచి రూ.87వేలు మాయమైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

సీక్రెట్ కోడ్, పిన్ నంబర్ వెల్లడించకపోయినా...రూ.87వేలు మాయం

కామారెడ్డి: సీక్రెట్ కోడ్, పిన్ నంబర్ వంటివి వెల్లడించకపోయినా అకౌంట్‌లో నుంచి రూ.87వేలు మాయమైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డ్ క్యాన్సలైజేషన్ కోసం ఓ మహిళా ఉపాధ్యాయురాలు నిన్న(బుధవారం) కామారెడ్డి ఎస్‌బీఐలో దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డ్ క్యాన్సలైజేషన్ గురించి ఉన్నతాధికారులకు మెయిల్ పంపామని రేపు కాల్ వస్తుందని సిబ్బంది చెప్పారు. దీంతో ఓ ఆన్‌లైన్‌ కాల్‌లో మీ పూర్తి వివరాలు తెలపాలని అవతలి వ్యక్తి కోరారు. అయితే సీక్రెట్ కోడ్, పిన్ నంబర్ వంటివి వెల్లడించకపోయినా.. ఆమె మాట్లాడే సమయంలోనే అకౌంట్‌లో నుంచి రూ.87 వేల 753 నగదు మాయమైంది. ఈ ఘటనపై బాధితురాలు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-06-16T14:36:08+05:30 IST