Manuguruకు కామారెడ్డి విద్యార్థిని సైకిల్‌ యాత్ర

ABN , First Publish Date - 2022-05-17T17:58:56+05:30 IST

భూసారం పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్రను చేపట్టిన బానోత్‌ వెన్నెల సోమవారం మణుగూరు డిగ్రీ కళాశాలకు

Manuguruకు కామారెడ్డి విద్యార్థిని సైకిల్‌ యాత్ర

మణుగూరు రూరల్‌(భద్రాద్రి కొత్తగూడెం): భూసారం పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ యాత్రను చేపట్టిన బానోత్‌ వెన్నెల సోమవారం మణుగూరు డిగ్రీ కళాశాలకు చేరుకుంది. భూసార పరీక్షలపై రైతాంగానికి అవగాహాన కల్పించుకుంటూ ఈ బాలిక 5000 వేల కిలోమీటర్ల దూరం కొనసాగనుంది. బాలిక లక్ష్యాన్ని పలువురు అభినదించారు. డిగ్రీ కళాశాలకు చేరుకున్న వెన్నెలను జాతీయ సేవా పధకం(ఎన్‌ఎస్‌ఎస్‌) నిర్వాహకులు ఘనం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెన్నెలను డిగ్రీకళాశాల ప్రిన్సిపల్‌ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్‌ సమీపంలో ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన బానోత్‌ వెన్నెల యాత్ర ప్రారంభించి 15 రోజులకు మణుగూరుకు చేరుకుందని తెలిపారు. ఇప్పటికీ 1440 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై యాత్ర చేసిన విద్యార్థిని అభినందించారు. 

Updated Date - 2022-05-17T17:58:56+05:30 IST