కామారెడ్డిలో 400 ఎకరాలకు పైగా నీట మునిగిన పంట..రైతుల ఆవేదన

ABN , First Publish Date - 2021-04-14T17:06:52+05:30 IST

దోమకొండ బిబిపేట మండలాల్లోని ఐదు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. కాళేశ్వరం వాటర్‎తో మానేరు డ్యామ్ నిండటంతో..డ్యామ్ బ్యాక్ వాటర్‎తో 400 ఎకరాలకు

కామారెడ్డిలో 400 ఎకరాలకు పైగా నీట మునిగిన పంట..రైతుల ఆవేదన

కామారెడ్డి: దోమకొండ బిబిపేట మండలాల్లోని ఐదు గ్రామాల్లో పంటపోలాలు నీటమునిగాయి. కాళేశ్వరం వాటర్‎తో మానేరు డ్యామ్ నిండటంతో..డ్యామ్ బ్యాక్ వాటర్‎తో 400 ఎకరాలకు పైగా పంట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో పంట చేతికొచ్చే సమయానికి ఇలా పంటలోకి నీరు రావడంతో ఆగ్రహం చెందుతున్నారు. నెల రోజుల పాటు నీటి విడుదల ఆపాలని  రైతులు అధికారులను కోరారు. నీటి విడుదలను ఆపకపోతే..ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాల్సివుంటుందని రైతులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-14T17:06:52+05:30 IST