కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో ఈదురు గాలులతో కూడిన బారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-05T16:25:38+05:30 IST

బాన్సువాడ డివిజన్ కేంద్రంలో తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన బారీ వర్షం కురిసింది.

కామారెడ్డి జిల్లా: బాన్సువాడలో ఈదురు గాలులతో కూడిన బారీ వర్షం

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ డివిజన్ కేంద్రంలో గురువారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన బారీ వర్షం కురిసింది. దీంతో కరెంట్ లేక అంధకారం నెలకొంది. బాన్సువాడ డివిజన్ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు. రేకుల షెడ్లు నేలకొరిగాయి. వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కాగా భారీ వర్షం కారణంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇబ్రహీంపెట్‌లో నిర్వహించనున్న ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం వాయిదా పడింది.

Read more