కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాంగులు, వంకలు, చెరువులు మత్తడి దుంకుత్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు తెగి రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రాజంపేట మండలం కొండాపూర్ శివారులోని సంగమేశ్వర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కామారెడ్డి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు సంగమేశ్వర్ వాగులో చిక్కుకుంది. బస్సులో సుమారుగా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. తాడు సహాయంతో రాజంపేట పోలీసులు ఆర్టీసీ బస్సును ఒడ్డుకు చేర్చారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.