మానవత్వం చాటుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-12T19:19:44+05:30 IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గర్భిణిల పట్ల పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు

గోదావరిఖని: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గర్భిణిల పట్ల పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. గోదావరిఖనిలో లాక్‌‌డౌన్‌ కారణంగా అవస్థలు పడుతున్న గర్భిణిని గమ్యానికి చేర్చారు ఏసీపీ ఉమెందర్. ప్రధాన గాంధీ చౌరస్తాలో లాక్‌డౌన్ దృష్ట్యా వాహనాలు లేక ఎండలో చౌరస్తాలో గర్భిణీ, ఆమె సోదరి నడుచుకుంటు వెళుతుండగా గమనించిన  గోదావరిఖని ఏసీపీ వి.ఉమెందర్ వారికి సహాయం అందించారు. వన్ టౌన్ సీఐ రమేష్ బాబుకు చెప్పి తక్షణమే తన వాహనంలో ఇద్దరిని వాళ్ల ఇంటి వద్దకు చేర్చాలని సూచించారు. మహిళా కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి పంపించారు. ఏసీపీ ఉమెందర్, పోలీస్ అధికారులు చేసిన సహాయానికి వారు అభినందనలు తెలియజేశారు. అక్కడ విధుల్లో ట్రాపిక్ సీఐ ప్రవీణ్ కుమార్, వన్‌టౌన్ ఎస్సై ఉమాసాగర్ ఉన్నారు.


కామారెడ్డి సీఐ ఔదార్యం

కామారెడ్డి: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గర్భిణిల పట్ల పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లా బస్టాండ్ ఆవరణలో ఇబ్బంది పడుతున్న గర్భిణికి పట్టణ సీఐ మధుసూదన్ సహాయం అందించారు. గర్భిణిని సురక్షితంగా స్వగ్రామానికి పంపించారు. లాక్‌డౌన్ విషయం తెలియక పోవడంతో  గర్భిణీ మహేశ్వరి ఈ ఉదయం పరీక్షల నిమిత్తం స్వగ్రామం చిన్న పొతంగల్ నుంచి  కామారెడ్డికి వచ్చింది. పరీక్షలు అనంతరం స్వగ్రామం చిన్న పొతంగల్ వెళ్లేందుకు బస్టాండ్ చేరుకోగా అప్పటికే లాక్‌డౌన్ ప్రారంభమైంది. స్వగ్రామం వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న గర్భిణి మహేశ్వరిని సీఐ మధుసూదన్ డీసీఎంలో స్వగ్రామం పంపించారు.

Updated Date - 2021-05-12T19:19:44+05:30 IST