కమనీయం.. పాల ఉట్ల వేడుకలు

ABN , First Publish Date - 2022-08-20T04:39:36+05:30 IST

జిల్లా కేం ద్రమైన నారాయణపేటలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. సా

కమనీయం.. పాల ఉట్ల వేడుకలు
పేటలో ఊరేగింపులో పాల్గొన్న యువకులు

- గోపిక, కృష్ణ వేషధారణలో చిన్నారుల కోలాహలం

- కృష్ణాష్టమి వేడుకలకు పోటెత్తిన భక్తజనం

- ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్‌ 

నారాయణపేట, ఆగస్టు 19 : జిల్లా కేం ద్రమైన నారాయణపేటలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు వాడవాడలో వేడుకల్లో భాగంగా పాల ఉట్లను పగులగొడుతు యువతతో పాటు చిన్నారులు గోపిక కృష్ణ వేషధారణతో నృత్యాలు చేశారు. చౌక్‌ బజార్‌ మిత్రమండలి ఆధ్వర్యంలో చౌక్‌ బజార్‌లో 25 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పాల ఉట్టిని ఎస్‌ఎస్‌కే సమాజ్‌ యువకులు పగుల గొట్టారు.  ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచందన, పుర చైర్‌పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌, మిత్ర మండలి అధ్యక్షుడు హరినారాయణ భట్టడ్‌లు చిన్నారులకు బహుమతులు అందించారు. ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణతో పాటు మిత్రమండలి సభ్యులు వెంకట్రాములు, ప్రకాష్‌ భట్టడ్‌, ఆనంద్‌, వద్ది నారాయణ పాల్గొన్నారు.   అంతకుముందు వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కృష్ణుడి చిత్రపటాన్ని ట్రాక్టర్‌లో ఉంచి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.  

ఊట్కూర్‌ : మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక, చిన్నపొర్ల ఉన్నత పాఠశాలల్లో శ్రీకృష్ణాష్ఠమి వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో పాలఉట్లను కొట్టడం ఎంతగానో ఆకట్టుకుంది.  హెచ్‌ఎం గోపాల్‌,  ఇన్‌చార్జి హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు, సీఆర్పీ మహేష్‌గౌడ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా మండలంలోని లోకాయపల్లి, కోటకొండ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ పద్మజారాణి గోమాత పూజలో పాల్గొన్నారు. రఘువీర్‌యాదవ్‌, గోపాల్‌యాదవ్‌, రమేశ్‌యాదవ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు గోపికల వేష ధారణతో నృత్యాలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టికొట్టారు.  హెచ్‌ఎం బనదయ్య పాల్గొన్నారు.

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని శ్రీకృ ష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని కృష్ణ వేణి పాఠశాలలో పాల ఉట్ల కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని యాదవనగర్‌ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి కి పుష్కరస్నానం చేయించారు. అంతకు ముందు పవిత్ర కృష్ణానది నుంచి తెచ్చిన జల్దిబిందెను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయాన్ని పుష్కర నీటితో శుద్ధి చేశారు. 

మాగనూరు : ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకు న్నారు. విద్యార్థులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణతో నృత్యాలు చేసి ఉట్లను కొట్టారు. 

కృష్ణ : కృష్ణాష్టమిని పురస్కరించుకొని మండలంలోని గుడెబల్లూరు లక్ష్మి వేంక టేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహా నికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనం తరం ఉయ్యాల వేడుక, ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

దన్వాడ : కృష్ణాష్టమి వేడుకలు భాగంగా ధన్వాడ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణుని విగ్ర హానికి మాజీ వైస్‌ ఎంపీపీ రాంచంద్రయ్య దంపతులు పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. శ్రీ చైతన్య విద్యా మందిర్‌, శ్రీ సాయి సరస్వతి విద్యా మందిర్‌, క్రాంతి విద్యాలయం, శ్రీ భారతి విద్యానికేత న్‌లో విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుడి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఒకటో అంగన్‌వాడీ కేంద్రంలో కృష్టాష్ట మి వేడుకలు నిర్వహించారు. 

కోస్గి/దామరగిద్ద : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విశ్వహిందూ పరిషత్‌ కోస్గి ప్రఖండ, శ్రీవాణి విద్యామందిరం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.  స్థానిక రామాలయం చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ శిరీష, విజయ్‌కుమార్‌ పాల్గొనగాచిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషాధారణలతో ఆకట్టుకున్నారు.  అదే విధంగా దామరగిద్ద మండలంలోని పలు పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.








Updated Date - 2022-08-20T04:39:36+05:30 IST