కమల్‌ప్రీత్‌కు నిరాశ

ABN , First Publish Date - 2021-08-03T09:52:27+05:30 IST

డిస్కస్‌త్రో ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ నిరాశపరిచింది. ఫైనల్లో ఆమె అత్యుత్తమంగా 63.70మీ. దూరం మాత్రమే...

కమల్‌ప్రీత్‌కు నిరాశ

డిస్కస్‌త్రో ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ నిరాశపరిచింది. ఫైనల్లో ఆమె అత్యుత్తమంగా 63.70మీ. దూరం మాత్రమే డిస్క్‌ను విసిరి ఆరో స్థానంలో నిలిచింది. తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె మొత్తం ఆరు ప్రయత్నాల్లో మూడు సార్లు ఫౌల్‌ కావడం గమనార్హం. మహిళల 200 మీ. హీట్స్‌లో ద్యూతీ 23.85 సె.తో చివరిస్థానం (7)లో నిలిచింది.


షూటింగ్‌

పురుషుల 50 మీ. రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేషన్‌లో ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 21వ, సంజీవ్‌ రాజ్‌పుత్‌ 32 స్థానాల్లో నిలిచారు. 


Updated Date - 2021-08-03T09:52:27+05:30 IST