Chitrajyothy Logo
Advertisement
Published: Sun, 16 Jan 2022 16:05:12 IST

‘పుష్ప’ సినిమాకు కమల్‌ ప్రశంసలు!

twitter-iconwatsapp-iconfb-icon
పుష్ప సినిమాకు కమల్‌ ప్రశంసలు!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. నెగటివ్‌ టాక్‌తో మొదలైన ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో విజయవంతంగా ఆడుతోంది. ఇటీవల ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌ వీక్షించారు. పైగా పక్కన దేవిశ్రీ ప్రసాద్‌ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి అమెజాన్‌ ప్రైమ్‌లో ‘పుష్ప’ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా కమల్‌తో దిగిన ఫొటోను రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మాకోసం మీ విలువైన సమయాన్ని కేటాయించి ‘పుష్ప’ సినిమా చూసినందుకు ఉలగనయగన్‌ కమల్‌ హాసన్‌ సార్‌కి ధన్యవాదాలు. మా సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం’’ అని రాసుకొచ్చారు దేవిశ్రీప్రసాద్‌. ఆయన చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్‌ స్పందించారు. ‘సినిమా చూసినందుకు ధన్యవాదాలు’ కమల్‌ సార్‌ అని పోస్ట్‌ చేశారు. 




Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International